రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం సీఎం
జగన్ తోటే సాధ్యపడుతుందని హరిపురం సచివాలయం కన్వీనర్ ధూళి అప్పారావు (బుజ్జి) అన్నారు. శనివారం ఆయన రాంబిల్లి మండలం హరిపురం గ్రామంలో పార్టీ నేతలతో కలిసి ఏపీకి జగనన్న ఎందుకు అవసరం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలోని ఇంటింటికి వెళ్లి వైసిపి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేశారు.