నక్కపల్లిలో అఘోరి హల్ చల్
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో టోల్ ప్లాజా వద్ద సోమవారం అఘోరి హల్ చల్ చేసింది. టోల్ గేట్ సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించారంటూ అఘోరి ఆరోపించడంతో 2 గంటల పాటు హైడ్రామా కొనసాగింది. నాగసాధుకే రక్షణ లేకపోతే.. మహిళల పరిస్థితి ఏంటి, అందుకే కలియుగం ఇలా మారిపోయిందని అఘోరి అన్నారు. పోలీసుల రంగ ప్రవేశంతో ఇరు వర్గాల మధ్య గొడవ సద్దుమణగడంతో అఘోరి అక్కడి నుంచి వెళ్లిపోయారు.