రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ. 4, 500 కోట్లతో అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు రాష్ట్ర హోంమంత్రి అనిత అన్నారు. శనివారం సాయంత్రం ఎస్ రాయవరం మండలం పెట్టుగోళ్లపల్లిలో ఆమె పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పండగ వాతావరణంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నట్లు పేర్కొన్నారు.