ప్రాంతాల మధ్య సంబంధబాంధవ్యాల మెరుగుకు, యువత శారీరక దారుఢ్యానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని రావణాపల్లి ఎంపిటిసి ఇరువాడ సత్యవాణి పేర్కొన్నారు. సెగ్మెంట్ పరిధి అంతాడ, పరదేశిపాకలు, తుమ్మలపాలెం తదితర గ్రామాల్లో యువతకు సిపిఐ మండల కార్యదర్శి ఇరువాడ దేవుడు స్థానిక పెద్దలు నేతలతో కలిసి వాలీబాల్ కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత ఆటపాటలు క్రీడల్లో రాణించాలని అన్నారు. క్రీడా స్ఫూర్తితో మన్యానికి పేరు తీసుకురావాలని కోరారు. క్రీడలు ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతకు ఎంతో దోహదపడతాయన్నారు.