మాకవరపాలెం: లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డ విఆర్ఓ
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలో గల మాకవరపాలెం, తామరం గ్రామాలకు రెవెన్యూ అధికారిగా వ్యవహరిస్తున్న లక్ష్మణరావు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు శుక్రవారం మాకవరపాలెం తహసిల్దార్ కార్యాలయంలో పట్టుకున్నారు. కార్యాలయం తలుపులు మూసి అధికారులు విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.