నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్. రేవతమ్మ ఆధ్వర్యంలో డౌనూరు చెక్ పోస్ట్ వద్ద నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ తో సోమవారం ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఆటో, ఆర్టీసీ బస్సులలో ప్రయాణించే ప్రయాణికుల లగేజీలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సీఐ రేవతమ్మ మాట్లాడుతూ గంజాయి, మాదకద్రవ్యాల రవాణా అరికట్టడానికి ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ తనిఖీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని పేర్కొన్నారు.