విశాఖ కలెక్టరేట్ గ్రీవెన్స్‌కు 328 వినతులు
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ "పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్" లో వచ్చిన అర్జీలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదన్నారు. "ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ" కార్యక్రమం సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. మొత్తం 328 వినతులను స్వీకరించారు.