రౌడీ షీటర్లు హద్దు మీరితే చర్యలు తప్పవని పోలీస్ అధికారులు హెచ్చరించారు. నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ ఆదేశాల మేరకు నగరంలో అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో సంబంధిత రౌడీ షీటర్లకు పోలీస్ అధికారులు ఆదివారం సాయంత్రం కౌన్సిలింగ్ నిర్వహించారు. వివాదాల్లో తలదూర్చవద్దన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా జీవించాలన్నారు.