గిరిజన సహకార సంస్థ (జీసీసీ) చైర్మన్ గా కె. శ్రావణ్ కుమార్ విశాఖ ఈస్ట్ పాయింట్ కాలనీలో గల ప్రధాన కార్యాలయంలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది గిరిజనులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. మన్యం అభివృద్ధికి జిసిసి తోడ్పాటు అందిస్తుందన్నారు. గిరిజన రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. సెక్యూరిటీ గార్డ్ ల పెండింగ్ వేతనాలను క్లియర్ చేస్తామన్నారు.