విశాఖ ఉత్తర నియోజకవర్గం 26వ వార్డులో రికార్డు స్థాయిలో ఇల్లు పట్టాల పంపిణీ చేశారు. నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఆదేశాల మేరకు సచివాల ఏపిడి చేతుల మీదుగా 960 ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం సచివాలయ కార్యదర్శులు ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో వార్డు ఇంచార్జ్ పీలా వెంకటలక్ష్మి, కోరుకొండ శేషు, నక్కా శ్యామల, అమ్మాజీ, పెంటకోట హరికృష్ణ, పాండవ శ్రీను, బొడ్డేటి కిరణ్, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.