విశాఖలో టమాటా ధరలు అమాంతం పెరిగిపోయాయి. బుధవారం బహిరంగ మార్కెట్లో కిలో 50 రూపాయలకు పైగానే అమ్మకాలు సాగించారు. విజయవాడ వరదల కారణంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడంతో విశాఖకు రావలసిన టమాట సరకు ఆగిపోయింది. దీంతో ఉన్న టమాటాలను నిల్వ చేసి అధిక ధరలకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఈ ధరలు తగ్గే అవకాశం అని వ్యాపార వర్గాలు బుధవారం తెలిపాయి.