విశాఖ: జమ్మి చెట్టు నాటండి ఆరోగ్యంగా జీవించండి
జమ్మి చెట్టు నాటి పెంచండి, ఆరోగ్యంగా జీవించండి అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం కోరారు. సోమవారం విశాఖలోని ఎంవిపి కాలనీలో మీడియాతో మాట్లాడారు. గడిచిన 10 రోజులుగా విజయదశమి వేడుకల్లో భాగంగా జమ్మి చెట్టు నాటి పెంచండి, పూజించండి అని ప్రచారం చేస్తూ వెయ్యి మొక్కలు పంపిణీ చేశామన్నారు.