ఎస్ కోట మండలం రేగ పుణ్యగిరి గిరిజన ప్రజలు మంగళవారం తమ గ్రామంలో గల సమస్యలు పరిష్కరించాలని నియోజకవర్గ జనసేన నాయకులు వబ్బిన సన్యాసినాయుడు ఆధ్వర్యంలో ఎల్ కోటలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి కి వినతి పత్రం అందజేశారు. ఎస్. కోట నుండి తమ గ్రామానికి 3 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం చేపట్టాలని, తమకు పోడు పట్టాలు ఇప్పించాలని, హౌసింగ్ స్కీములు మంజూరు చేయాలని, ఉపాధి హామీ పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని కోరారు.