ఎస్. కోట మేజర్ పంచాయతీ పరిధిలో 12, 13 వార్డుల్లో ఆదివారం ఇంటింటికి కుళాయిల పనులను ప్రారంభించారు. ఈ మేరకు వార్డు సభ్యులు అనకాపల్లి చెల్లయ్య పనులను లాంఛనంగా ప్రారంభించారు. సర్పంచ్ సంతోషి కుమారి ఆదేశాలతో పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పంచాయతీ పరిధిలో ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించే దిశగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఎంపీటీసీ వాకాడ సింహాచలం, వార్డు సభ్యులు కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.