కొత్తవలస మండలం ముషిరాం గ్రామంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సిఐ రాజశేఖర్ నాయుడు గురువారం తన సిబ్బందితో కలిసి నవోదయం కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామాల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టవద్దని తెలిపారు. అక్రమంగా నాటు సారా తయారీ విక్రయాలు, బెల్ట్ షాపులు నిర్వహణ చట్ట వ్యతిరేకమని ఇలాంటి చర్యలకు పాల్పడితే శిక్షలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా సమాచారం అందిస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.