నవ ధాన్యాలతో నేల సారం

462பார்த்தது
నవ ధాన్యాలతో నేల సారం
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పాచిపెంట మండలాల్లో నవధాన్యాలు సాగు నేలతల్లికి బాగు కార్యక్రమం శనివారం నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయ రీజనల్ అధికారి కె. ప్రకాష్ పి. కోనవలస, కోటికపెంట, అమ్మవలస, కర్రివలస గ్రామాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ముఖ్యంగా ప్రతి గ్రామంలోనూ నవధాన్య విత్తనాలు, కిట్లు తయారీ, పంపిణీ మరియు గ్రౌండింగ్ గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా నవధాన్యాలు సాగు వల్ల ఉపయోగాలు, ప్రాముఖ్యతను గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ ఇంచార్జి పి. యశోధమ్మ, మండల ఇంచార్జిలు కె. బాలక్రిష్ణ, వి. తిరుపతినాయుడు, కె. శ్రీనివాసు, బి రవణమ్మ, ఐసీఆర్పీలు విజయకుమార్, సురేష్, కుమార్, రమణ, వెంకటరమణ మరియు రైతులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி