పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం పనసభద్ర పంచాయతీ దుగ్గేరు, మూలవలస గ్రామాలలో గురువారం నవధాన్యాలు సాగు-నేలతల్లికి బాగు అనే కార్యక్రమం పై ర్యాలీ నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయ సీఆర్పీ ఉర్లక నాగార్జున మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయంలో నవధాన్యాలు చాలా ఉపయోగకరమైనవని, ఈ నవధాన్యాలు వేయడం వల్ల భూమిలో జీవవైవిధ్యం పెరిగి, ప్రధాన పంటకు కావలసిన సూక్ష్మ, స్థూల పోషకాలు అందుతాయన్నారు. అదేవిధంగా నేలలో సేంద్రియ కర్బన శాతం పెరుగుతుందని తెలిపారు. బహుళ పంటలు వేయడం వల్ల కలుపు నివారించవచ్చు, అదనపు ఆదాయం కూడా వస్తుందన్నారు.