పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం మార్కొండపుట్టి రైతు భరోసా కేంద్రంలో నవధాన్యాల సాగు నేలతల్లి బాగు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి బి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రైతులకు నవధాన్య కిట్లు పంపిణీ చేశారు. నవధాన్యాలు సాగు వల్ల ప్రయోజనాలు తెలియజేస్తూ, నేటి కాలంలో రైతులు నవధాన్యాల సాగు చేయాలని, అధిక దిగుబడులు సాధించాలని అన్నారు. ఈ నవధాన్యాలు ఆర్బికే కేంద్రంలో అందుబాటులో ఉంటాయని, కావున రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో విఎఎ సత్యవతి, ప్రకృతి వ్యవసాయ సీఆర్పీ ఉర్లక నాగార్జున, రెడ్డి సుందరరావు రైతులు పాల్గొన్నారు.