ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో నవంబర్ 29, విశాఖ డిసెంబర్ 8న ఉత్తరాంధ్ర మాలల గర్జనను జయప్రదం చేయాలని రాజాం నియోజకవర్గ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు ఆదివారం పిలుపునిచ్చారు. రాజాం డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద పోస్టర్లు, కరపత్రాలు ఆవిష్కరించారు. ఎస్సీలు వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు కృష్ణ, గౌరీ శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు.