పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం అర్బన్ రైతు భరోసా కేంద్రంలో ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రభంధకులు కె. షణ్ముఖరాజు ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. షణ్ముఖరాజు మాట్లాడుతూ నేటి కాలంలో భిన్న వాతావరణ మార్పులు మారుతున్న నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయం చేసేవిధంగా పని చేయాలని ఆదేశించారు. సాలూరు మధుసూదనరావు మాట్లాడుతూ నేటి కాలంలో డిజిటలైజేషన్ నడుస్తోంది. కాబట్టి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అందరూ కూడా రైతు భరోసా కేంద్రం అనుసంధానంగా పనిచేయాలని సూచించారు. అదేవిధంగా రైతు సాధికార సంస్థ నుండి రాష్ట్ర ఎస్ఆర్పీ దేవుళ్ళు మాట్లాడుతూ ఈ ఖరీఫ్ సాగులో సుమారుగా 1375 మంది రైతులు 1100 ఎకరాలు గులిరాగి పంట వేయాలని, బహుళ జాతి పంటలు సాగు చేయాలని చెప్పారు. గులిరాగి అతి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆర్డినేటర్ లు మానస, నరసింహ, డివిజనల్ ఎమ్ టి యశోధమ్మ, సాలూరు, మక్కువ, పాచిపెంట మండలాల ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.