నవధాన్య విత్తనాల కిట్లు పంపిణీ

949பார்த்தது
నవధాన్య విత్తనాల కిట్లు పంపిణీ
పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం చప్పబుచ్చింపేట రైతు భరోసా కేంద్రంలో శుక్రవారం నవధాన్య విత్తనాలు కిట్లు పంపిణీ చేయడం జరిగింది. "నవధాన్యాలు సాగు నేలతల్లికి బాగు" అనే కార్యక్రమంలో భాగంగా ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రబంధకులు షణ్ముఖరాజు, అదనపు జిల్లా ప్రబంధకులు ధనుంజయ రావు సూచనల మేరకు మక్కువ యూనిట్ ఇంచార్జిలు నలితం గంగరాజు, ఉర్లక నాగార్జున పొలంబడి రైతులకు నవధాన్య విత్తనాల కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ నవధాన్యాలు సాగు చేయడం వల్ల భూమిలో జీవవైవిధ్యం పెరిగుతుందని, అలాగే కర్బన శాతం పెరిగి భూసారం పెరుగుతుందని, వానపాములు వృద్ధి చెందుతాయని తద్వారా అధిక దిగుబడులు వస్తాయన్నారు. ఈ నవధాన్య విత్తనాలు కిట్లు ప్రతి రైతు భరోసా కేంద్రం వద్ద రైతులకు అందుబాటులో ఉంటాయని, రైతులందరు ఈ నవధాన్య విత్తనాలు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వెన్నెల, వైస్ ఎంపిపి చప్ప సూర్యనారాయణ, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మరియు పొలంబడి రైతులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி