డెంకాడ మండలం కొండయ్య పాలెం ప్రాథమిక పాఠశాలలోని బూత్ నంబర్ 17 లో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కార్యక్రమాన్ని శనివారం కలెక్టర్ బి ఆర్ అంబేద్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సవరణ ప్రక్రియ పురోగతిని బి ఎల్ ఓ లను అడిగి తెలుసుకున్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పట్ల సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. అనంతరం పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు.