వార్షిక తనిఖీలలో భాగంగా జిల్లా ఎస్పీ వకుల్ శుక్రవారం మెంటాడ మండలం ఆండ్ర పోలీసు స్టేషన్ను సందర్శించారు. ఆయన స్టేషన్ పరిసరాలు, ప్రాపర్టీ రూం, లాకప్ సెల్స్, సీజ్ చేసిన వాహనాలను పరిశీలించారు. అలాగే, పోలీసు రికార్డులు, సిడి ఫైల్స్ తనిఖీ చేశారు. అనంతరం వృద్ధులకు చీరలు, యువతకు వాలీబాల్ కిట్స్ పంపిణీ చేశారు.