దత్తిరాజేరు మండలంలోని దత్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో గుచ్చిమి అంగన్వాడీ కార్యకర్త పి జ్యోతి కిషోర్ బాలికల చేత బుధవారం మధ్యాహ్నం బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుకోవాలని కోరారు. మహిళా పోలీస్ పద్మ, కాంత దమయంతి లీల తదితరులు పాల్గొన్నారు.