బొండపల్లి, గంట్యాడ మండలాల్లో శుక్రవారం ఏరువాక కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మణ్ వరి పంటను పరిశీలించారు. ఈ మేరకు కనిమెరక, వెలగాడలో పర్యటించి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. కోత దశకు వచ్చిన వరి పంటలో ఎక్కువగా రెక్క రాల్చు పురుగు సోకినట్లు గుర్తించారు. దీని నివారణకు కొరజన్, క్లోరో ఫైరీ ఫోస్ రసాయనాలను పిచికారి చేయాలని సూచించారు. ఏవో శ్యాం కుమార్ తదితర వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.