సీఎం చంద్రబాబు సోదరుడు, మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు మృతిపై బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన ఆదివారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నామన్నారు. రామ్మూర్తి నాయుడు మృతి బాధాకరమని ఎమ్మెల్యే అన్నారు. ఈ సంతాపన కార్యక్రమంలో బుడా చైర్మన్ లక్షుంనాయుడు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సంతాపం తెలిపారు.