అన్నపూర్ణ ఆపన్న హస్తం పేరుతో బొబ్బిలి మండలం కోమటి పల్లి గ్రామంలో బొంతలకోటి లక్ష్మి శంకర రావు దంపతులు వృద్ధులకు ఆహార పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆదివారం నాటికి 400 రోజులు పూర్తి అయ్యింది. ఈ కార్యక్రమానికి విశ్రాంత జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ప్రముఖ వైద్యులు డాక్టర్ కాశి నాయుడు పాల్గొని తన మనవరాలు బొత్స శ్రావ్య సిరి పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు స్వీట్స్, భోజనాలు, చెప్పులు అందజేశారు.