వేపాడ: అక్రమంగా నిల్వ ఉంచిన బాణసంచా స్వాధీనం
వేపాడ మండలం సోంపురం ఎస్టీ కాలనీలో అక్రమంగా నిల్వ ఉంచిన రూ 18వేల 380 విలువైన బాణసంచా సామగ్రినీ సోమవారం స్వాదీనం చేసుకున్నామని వల్లంపూడి ఎస్సై బొడ్డు దేవి తెలిపారు. గ్రామానికి చెందిన గొర్లె వెంకన్న అనే వ్యక్తి గేదెల సత్యవతి ఇంటి పక్కన బాణసంచా సామగ్రిని తయారు చేస్తుండగా పట్టుకొని కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. సుమారు 1100 తారాజువ్వలు, 176 వంకాయ బాంబులు ఈ దాడిలో దొరికాయని తెలిపారు.