ఎస్ కోట: ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సుధారాణి
ఎస్ కోట నియోజకవర్గానికి చెందిన ప్రస్తుత ఎమ్మెల్సీ ఇందుకూరి రఘరాజు సతీమణి ఇందుకూరు సుధారాణి సోమవారం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తన నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా రిటర్నింగ్ అధికారి, జేసి సేతు మాధవన్ కు తన నామినేషన్ పత్రాన్ని అందజేశారు. ఈమె ప్రస్తుతం టిడిపిలో కొనసాగుతున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల విషయంలో రోజుకొక ట్విస్ట్ చోటు చేసుకోవడంతో స్థానికుల్లో ఉత్కంఠ రేపుతోందని పలువురు అంటున్నారు.