కొత్తవలస లోని రైలు పట్టాలు దాటుతుండగా ఓ వ్యక్తికి గాయాలైన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. బీహార్ కు చెందిన ఓ వ్యక్తి కొత్తవలసలో రైలు పట్టాలు దాటే ప్రయత్నం చేశాడు. ఇదే సమయంలో రైలు వెళ్తున్న నేపథ్యంలో గాలి తాకిడికి కింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. గమనించిన స్థానికులు ఆర్పిఎఫ్ అవుట్ పోస్ట్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రుడిని విశాఖ కేజీహెచ్ కు వైద్య చికిత్స నిమిత్తం తరలించారు.