తమ సమస్యలు పరిష్కరించాలని నిరసన తెలుపుతూ ఎస్. కోట మండలంలో 108 వాహన సిబ్బంది ఆదివారం నల్ల రిబ్బన్లు ధరించి విధులు నిర్వహించారు. ఏపీ 108 సర్వీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రభుత్వం తో జరిపిన సమావేశంలో సానుకూల హామీ రాకపోవడంతో నల్ల రిబ్బన్లు ధరించి విధులు నిర్వహిస్తున్నట్లు జిల్లా యూనియన్ అధ్యక్షులు వేమలి అప్పలనాయుడు తెలిపారు. వచ్చేనెల 8 వరకు ఇదే తరహాలో విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు.