శృంగవరపుకోట: పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య
శృంగవరపుకోట మండలం పెదఖండేపల్లి గ్రామానికి చెందిన పతివాడ రాంబాబు (55) కొన్నాళ్లుగా ఆనారోగ్యంతో బాధపడుతూ శనివారం మధ్యాహ్నం పురుగుల మందు తాగి, అపస్మారక స్థితిలో పడిపోయాడు. భార్య గమనించి, విజయనగరం కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. మృతుడు కుమారుడు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ వి. ఎన్. మూర్తి తెలిపారు.