వేపాడ: గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ డైరెక్టర్ గా లక్ష్మి
గిరిజన కో - ఆపరేటివ్ కార్పొరేషన్ డైరెక్టర్ గా వేపాడ మండలానికి చెందిన దాసరి లక్ష్మి ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆమె ఎన్నికకు సంబంధించి ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఈమె వేపాడ ఎంపీపీగా పనిచేసిన అనుభవం ఉంది. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం ఈమె చేసిన కృషి ఫలితంగా పదవి దక్కినట్లు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఆమె సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే లలిత కుమారికి తన కృతజ్ఞతలు తెలిపారు.