ఎస్. కోట మండలానికి అతి సమీపంలో గల తాటిపూడి జలాశయానికి గొర్రిపాటి బుచ్చి అప్పారావు పేరు పెట్టాలని ఎస్. కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి మంగళవారం అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. గొర్రెపాటి అనేక ప్రజా సమస్యలపై పోరాటాలు చేసిన పోరాట పటిమ కలిగిన వ్యక్తి అని కొనియాడారు. ప్రముఖ స్వతంత్ర సమరయోధుడుని గౌరవించే బాధ్యత మన ప్రభుత్వంపై ఉందన్నారు. తాటిపూడి రిజర్వాయర్ కు ఆయన పేరు పెట్టాలని సభాపతిని కోరారు.