విజయవాడ వరద బాధితుల కోసం స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సహాయం చేస్తున్నారు. బొబ్బిలి అభ్యుదయ విద్యా సంస్థలు, సహాయ స్ఫూర్తి ఫౌండేషన్, షికారుగంజి అమ్మసేవ ఫౌండేషన్ సంయుక్తంగా విజయవాడ వరద బాధితుల కోసం ఆదివారం విజయవాడ చేరుకుని సహాయం చేశారు. నగరం లోని సింగ్ నగర్, రాజరాజేశ్వరిపేట లో పర్యటించి 300 మందికి నిత్యావసరాలు, బట్టలు, 50 మంది పిల్లలకు పుస్తకాలు, వృద్దులకు మందులుతో కూడిన కిట్లను బాధితులకు పంపిణీ చేశారు.