ఏర్పేడు మండలంలోని పాపా నాయుడుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో సోమవారం అధ్యాపకులు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ నంద్యాల వెంకటసుబ్బమ్మ మాట్లాడుతూ తల్లిదండ్రుల ప్రోత్సాహం-అధ్యాపకుల బోధనోత్సాహానికి తోడైతే ప్రతి విద్యార్థి సమగ్రాభివృద్ధి చెందుతారన్నారు. ప్రతిరోజు యుక్త వయసులో ఉన్న తమ పిల్లల విద్యాభివృద్ధిని తల్లి తండ్రులు ప్రోత్సహించాలని చెప్పారు.