బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలంలో శుక్రవారం తెల్లవారుజామున మోస్తరు వర్షం ప్రారంభమైంది. వర్షానికి వీధులు జలమయమయ్యాయి. అల్పపీడనం బలపడి తుఫానుగా మారే అవకాశాలు ఉండడంతో స్థానిక రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను సూచించారు. మండల వ్యాప్తంగా వాతావరణం మారి ప్రజలు చలికి వణుకుతున్నారు.