సత్యవేడు నియోజకవర్గం బీఎన్. కండ్రిగ మండల పరిధిలోని అన్ని పంచాయతీలలోని ముఖ్య కూడలి వద్ద రేపు ఉచిత గ్యాస్ పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గురువారం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు సుధాకర్ నాయుడు తెలిపారు. ఉదయం 11 గంటలకు కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, వీఆర్వోలు, పంచాయతీ సిబ్బంది, బాలకృష్ణ పవన్ కళ్యాణ్ అభిమానులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.