అమెరికాలోని లాస్ వేగాస్లో నిర్వహించిన ఐటిసర్వ్ అలయన్స్ -2024 కాన్ఫరెన్స్ లో బుధవారం నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు గల అనుకూలతలు, ప్రభుత్వం అమలు చేస్తున్న ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను గురించి వారికి వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్న సరికొత్త పి-4 విధానం గురించి ఎమ్మెల్యే అక్కడి ప్రతినిధులకు తెలిపారు.