కుప్పం: శాంతిపురంలో ఇసుక ట్రాక్టర్ సీజ్
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కడపల్లి రిజర్వ్ ఫారెస్ట్ నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ ను ఫారెస్ట్ అధికారులు సీజ్ చేశారు. కడపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుందన్న విమర్శల నేపథ్యంలో ఆదివారం వేకువజామున అధికారులు దాడులు చేసి ట్రాక్టర్ ను అదుపులోకి తీసుకున్నారు. అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.