రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ బుధవారం అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బొకే అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం తనకు విప్ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మరింత బాధ్యతగా పనిచేసి నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ పటి ష్టతకు మరింత కృషి చేస్తానని ముఖ్యమంత్రికి తెలియజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.