నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ట్రైనర్ మునప్ప శుక్రవారం తెలిపారు. చిత్తూరు నగరంలోని ఇరవరం పీహెచ్ కాలనీలో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ లో చేతి వృత్తులకు సంబంధించిన ఎలక్ట్రికల్, ప్లంబింగ్ కోర్సులు ఉచితంగా నేర్పించి ఉపాధి అవకాశాలు కల్పించబడునని తెలిపారు. 18-35 ఏళ్ల యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.