లైసెన్స్ లేకుండా టపాసులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని వన్‌టౌన్ సీఐ జయరామయ్య ఆదివారం హెచ్చరించారు. కలెక్టర్ ఆదేశానుసారం చిత్తూరు నగరంలోని గిరింపేట పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో టపాకాయల దుకాణాన్ని ఏర్పాటు చేయడానికి ఆర్డీవో ప్రొసీడింగ్స్ ఇచ్చినట్లు వెల్లడించారు. అక్కడ తప్ప నగరంలో ఎక్కడైనా దుకాణాలు ఏర్పాటు చేసిన, ఇంట్లో టపాకాయలు విక్రయించిన చట్టరీత్య చర్యలు తీసుకుంటామన్నారు.