చిత్తూరు జిల్లాలో సోమవారం వరకు 65. 35 శాతం అపార్ ఐడీలు పూర్తి అయ్యాయని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలోని విద్యార్థులకు అపార్ కార్డ్ మంజూరుకు విద్యా శాఖ, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకొని ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులను ఆధార్ సెంటర్లకు పంపవద్దని ఆదేశించారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలన్నారు.