కనువిందు చేస్తున్న తలకోన జలపాతం
భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలంలోని తలకోన జలపాతం కనువిందు చేస్తోంది. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తలకోన జలపాతంలో నీటి ప్రవాహం పెరిగి జలపాతాన్ని తలపిస్తూ పర్యాటకులను కట్టిపడేస్తోంది. బుధవారం నీటి ప్రవాహం పెరగడంతో సందర్శకులను జలపాతం వద్దకు రాకుండా అధికారులు ఆంక్షలు విధించారు. అయితే ప్రమాద హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అటువైపు ఎవరిని వెళ్లనివ్వడం లేదు.