ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయాలి
అక్టోబర్ 1వ తేదీన పంపిణీ చేయవలసిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ పంపిణీ 100% పూర్తి చేయాలని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నియోజకవర్గంలోని మండల నాయకులకు, కార్యకర్తలకు సోమవారం పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్యం పెంచిన వృద్దాప్య, వితంతు, చేనేత, హిజ్రాలకు అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ సచివాలయ ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయాలని కోరారు.