చంద్రగిరి: చెక్ పోస్టు ఏర్పాటుకు స్థల పరిశీలన

66பார்த்தது
చంద్రగిరి: చెక్ పోస్టు ఏర్పాటుకు స్థల పరిశీలన
పూతలపట్టు- నాయుడుపేట జాతీయ రహదారిలో గాదంకి టోల్ ప్లాజా వద్ద చెక్ పోస్టు ఏర్పాటు కోసం చంద్రగిరి మండలంలోని పాకాలవారిపల్లె వద్ద పోలీస్ ఉన్నతాధికారులు శనివారం స్థలాన్ని పరిశీలించారు. ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ఏఎస్పీ మనోహరాచారి, డీఎస్పీ ప్రసాద్, చంద్రగిరి సీఐ సుబ్బరామిరెడ్డి స్థలాన్ని పరిశీలించారు. అక్రమంగా తరలి వెళుతున్న ఇసుకను అడ్డుకొనేందుకు చెక్ పోస్టును ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

தொடர்புடைய செய்தி