చంద్రగిరి మండలంలో ఇసుక అక్రమ రవాణా చేసిన, మద్యం బెల్ట్ షాపులు నిర్వహించిన కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ సుబ్బరామిరెడ్డి తెలిపారు. చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ మండలంలో ఎక్కడైనా బెల్ట్ షాపులు నిర్వహిస్తే చర్యలు తప్పవని, గ్రామాల్లో బెల్ట్ షాపు నిర్వహిస్తే ఎవరైనా 100, 112, చంద్రగిరి సీఐ, ఎస్ఐ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలిపితే చర్యలు తీసుకుంటామని తెలిపారు.