AP: నెల్లూరుతోపాటు రాయలసీమ జిల్లాలు వైసీపీకి కంచుకోటలాంటివి. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ వెంటనే ఇక్కడి ప్రజలు ఉండేవారు. కానీ 2024లో రాయలసీమలో జగన్కు భంగపాటు తప్పలేదు. ఈ క్రమంలో పార్టీని బలోపేతం చేసేందుకు వైసీపీ అధినేత జగన్ మార్పులకు శ్రీకారం చుట్టారు. జిల్లా అధ్యక్షులను, ఇన్ఛార్జ్లను మార్చి కొత్తవారికి అవకాశం కల్పించారు. రాయలసీమలో పార్టీ పూర్వ వైభవానికి జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.