మాజీ సీఎం జగన్ పై పీసీసీ అధ్యక్షురాలు షర్మిలా ఆరోపణలు చేయడం సరికాదని టెక్కలి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త పేరాడ తిలక్ పేర్కొన్నారు. శనివారం కోటబొమ్మాలి మండలం జర్జంగిలో జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించి టీడీపీ, జనసేన, బీజేపి పార్టీలకు మేలు జరిగేలా షర్మిలా చూస్తున్నారని అన్నారు. చంద్రబాబు, పవన్, చంద్రబాబు సూచనల మేరకే షర్మిల ఆస్తి డ్రామా అడుతున్నారన్నారు.